రాప్తాడు ఘటన.. బాలిక ఆరోగ్యం ఎలా ఉందంటే?

0చూసినవారు
రాప్తాడు ఘటన.. బాలిక ఆరోగ్యం ఎలా ఉందంటే?
AP: రాప్తాడులో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన పదవ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు మేజర్ బ్లీడింగ్ను అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. బాలికకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ చికిత్స అందిస్తున్న వైద్య బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్