40 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన చేప

7చూసినవారు
40 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన చేప
నాలుగు దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన అరుదైన స్పినాక్ పైప్‌ఫిష్ చేపలు తాజాగా పపువా న్యూగినియాలోని సెపిక్ నదిలో ప్రత్యక్షమయ్యాయి. 1985లో చివరిసారిగా కనిపించిన ఈ చేపలను స్థానిక మహిళ హెలెన్ అసు రొయ్యల వేటలో తన వలతో పట్టుకుంది. పరిశోధకులు వీటిని స్పినాక్ పైప్‌ఫిష్‌గా ధృవీకరించారు. సముద్ర గుర్రాల జాతికి చెందిన ఈ చేపలు సన్నని శరీరం, పొడవాటి ముట్టెతో విభిన్నంగా ఉంటాయి. మగ చేపలు తమ కడుపులోని సంచిలో పిల్లలను మోయడం వీటి ప్రత్యేకత. పరిశోధకులు ఇప్పుడు వీటి జీవనశైలిపై అధ్యయనం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్