
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం ముంబైకు గన్స్ తరలించిన మహిళలు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో ఆయుధాల సరఫరాకు సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, బబిత అనే ఇద్దరు మహిళలను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 15న ఢిల్లీ నుంచి రైలులో ముంబైకి పిస్టల్, బుల్లెట్లు తీసుకెళ్లి మరో వ్యక్తికి అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో హర్యానాకు చెందిన కునాల్, సుమిత్తో పాటు కాల్పులకు పాల్పడిన హృతిక్, రేహన్, ఫూల్ సింగ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు సమాచారం.




