
ఏపీలో డీలిమిటేషన్.. 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు ప్రస్తుతమున్న 175 నుండి 263కు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల కొత్త మ్యాజిక్ ఫిగర్ 132కి చేరుకోనుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్లు పెరగడం, ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. మొత్తం 88 అదనపు స్థానాలతో రాబోయే ఎన్నికల్లో ఈ రీజియన్లదే కీలక పాత్ర కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల పెంపుపై జరుగుతున్న ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.




