ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
Sep 11, 2026, 14:09 IST/

తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Sep 11, 2026, 14:09 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలోనూ శుక్ర, శనివారాల్లో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.