ఢిల్లీలో యమునా నదిపై రిక్రియేషనల్ క్రూయిజ్ సేవలు మంగళవారం అందుబాటులోకి రానున్నాయి. కేంద్రమంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే ప్రయాణికులకు జల రవాణా సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇటీవల యమునా నదిలో నిర్వహించిన క్రూయిజ్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, నేడు ప్రయాణ సేవలు మొదలవుతున్నాయి.