RED ALERT: ఏపీలో భారీ వర్షాలు

21చూసినవారు
RED ALERT: ఏపీలో భారీ వర్షాలు
ఏపీ తీరాన్ని ఎట్టకేలకు 'అర్నబ్' అతి తీవ్ర తుఫాన్ దాటింది. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ, క్రమంగా తీవ్ర తుఫాన్ నుండి తుఫాన్గా, ఆపై వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ తీరం దాటినప్పటికీ, ప్రభావం కొనసాగుతున్నందున కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, పల్నాడు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్