ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీటిలో చిక్కుకున్న ట్రక్కు డ్రైవర్ను ఓ రిపోర్టర్, మరో స్థానికుడు ప్రాణాలకు తెగించి కాపాడారు. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఆ జర్నలిస్ట్, నీటిలో మునిగిపోతున్న వాహనాన్ని గమనించి వెంటనే స్పందించారు. ప్రమాదకరమైన వరద ప్రవాహంలోకి దూకి, ట్రక్కు తలుపులు తెరిచి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరిద్దరి సమయస్ఫూర్తి, మానవత్వాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.