ఢిల్లీలో విపక్ష ‘
ఇండియా’ కూటమి సోమవారం నాడు సుప్రీంకోర్టు వైపు నిరసన మార్చ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా.. సెంట్రల్ ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పటేల్ చౌక్, జన్పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ, నిష్క్రమణలు నిలిపివేశారు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న ఈ మార్చ్ దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీఓ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.