TG: కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021 ఏప్రిల్ 11న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తిలో ఆయన కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి మాస్కు ధరించకుండా ప్రచారంలో పాల్గొన్నారని అభియోగం ఉంది. ఈ కేసులో సీఆర్‌పీసీ 313 కింద నిందితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు కోర్టు విచారణ చేపట్టింది.