
నేటి నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.




