
ఏపీలో వర్షాలు.. తెలంగాణలో చలి
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు వాతావరణం భిన్నంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. మరోవైపు తెలంగాణలో వర్ష సూచనలు తగ్గి వాతావరణం పొడిగా మారనుంది. హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో నవంబర్ 29 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.




