రిషభ్‌ పంత్‌ జట్టుదే ఇరానీ కప్‌

0చూసినవారు
రిషభ్‌ పంత్‌ జట్టుదే ఇరానీ కప్‌
రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీలో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కశ్మీర్‌ను 167 పరుగుల తేడాతో ఓడించింది. రెండో ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ టీమ్‌ 310 పరుగులు చేయగా, స్మరణ్‌ 135 పరుగులు సాధించాడు. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్‌ 111 పరుగులకే కుప్పకూలింది. రెస్ట్‌ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ 237, జమ్మూకశ్మీర్‌ 278 పరుగులు చేశాయి.

సంబంధిత పోస్ట్