ORR వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి (వీడియో)

22చూసినవారు
TG: రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సిమెంట్‌ పైపుల లోడుతో వెళ్తున్న అశోక్‌ లేలాండ్‌ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్