AP: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జబర్దస్త్ టీమ్ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. జబర్దస్త్ కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబుకు గాయాలయ్యాయి. పాలకోడేరు మండలం పెన్నాడా అగ్రహారం వద్ద కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా వీరి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.