కొత్త కారు కొనుగోలు చేసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

4చూసినవారు
కర్ణాటకలోని శివమొగ్గలో దసరా పండుగ వేళ జరిగిన ఒక సంఘటన ఓ వ్యక్తికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కొత్తగా కారు కొనుగోలు చేసిన వ్యక్తి, దాన్ని షోరూమ్ నుంచి బయటకు తీసి వెళ్తుండగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు బారికేడ్లను ఢీకొట్టి రోడ్డుపైకి దూసుకెళ్లి, అటుగా వస్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పండుగ రోజున కొత్త కారుతో సంతోషంగా ఇంటికి వెళ్లాల్సిన వ్యక్తికి, ఈ అనూహ్య ఘటన పెద్ద చిక్కులను తెచ్చిపెట్టింది.

సంబంధిత పోస్ట్