అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు శనివారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌లకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడిని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా? ఆ బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తారా? అనేది చూడాలి.