భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్
కోహ్లీ జోడీ ఒక అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. వెస్టిండీస్ జట్టుపై వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి జోడీగా ఈ భారత స్టార్ ప్లేయర్లు చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఈ ఇద్దరు కలిసి విండీస్‌పై 15 మ్యాచుల్లో 982 పరుగులు సాధించారు. మరో 18 పరుగులు చేస్తే, ఈ మైలురాయిని అందుకుంటారు. ఈ అరుదైన ఘనత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.