
తాజ్ మహల్ వద్ద పర్యాటకులపై CISF సిబ్బంది దాడి (VIDEO)
ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లిన ఢిల్లీకి చెందిన సాజిద్ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. తమ మూడేళ్ల బాలుడు తప్పిపోయి సీఐఎస్ఎఫ్ అధికారి వద్ద కనిపించగా, బాలుడిని అప్పగించమని కోరిన సాజిద్‌ను సిబ్బంది ఆధార్ కార్డు చూపించాలని పట్టుబట్టారు. ఇతర గుర్తింపు పత్రాలు చూపించినప్పటికీ సిబ్బంది నిరాకరించడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో సిబ్బంది సాజిద్ ఫోన్ లాక్కొని, కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆజాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.




