ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


సింహాచలం ఆలయంలో డ్రెస్ కోడ్.. డిసెంబర్ 1 నుంచి కఠిన నిబంధనలు
Nov 21, 2026, 16:11 IST/

సింహాచలం ఆలయంలో డ్రెస్ కోడ్.. డిసెంబర్ 1 నుంచి కఠిన నిబంధనలు

Nov 21, 2026, 16:11 IST
AP: విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి డ్రెస్ కోడ్ అమలు కానుంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భక్తులు టీషర్ట్స్, జీన్స్ వంటి దుస్తులతో దర్శనానికి వస్తే ప్రవేశం ఉండదు. పురుషులు ధోతి, కుర్తా-పైజామా లేదా సాధారణ ప్యాంట్-షర్ట్, మహిళలు చీర లేదా చుడీదార్ ధరించాలి. నిత్య కళ్యాణం, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కూడా ఈ సంప్రదాయ దుస్తుల నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఈవో వెంకటరావు సూచించారు.