బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ నిందితుల్లో ఒకరైన రెహాన్‌కు రూ.35 వేలు, విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం ఫుట్‌బాల్ ఆడేందుకు గ్రౌండ్‌కు వస్తాడని తెలిసి, అక్కడ చంపేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు వివరించారు.