TG: హైదరాబాద్ మహానగరంలో లక్షలాది మంది ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కోసం 'కామన్ పాస్' (ఉమ్మడి పాస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. శుక్రవారం ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నూతన పాస్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించారు. దీనివల్ల ప్రయాణికుల సమయాభావం, ప్రయాణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.