TG: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట బైపాస్ వద్ద పొగమంచు కారణంగా ఆదివారం ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో చిక్కుకుపోయిన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.