పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

10చూసినవారు
TG: కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు, కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్