RTC డ్రైవర్ సమయస్ఫూర్తితో ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. నిర్మల్లో ఆదివారం ఓ మహిళ ప్రాణం తీసుకునేందుకు ఓ భవనంపైకి వెళ్లి దూకేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న RTC డ్రైవర్ పటేళ్ల రాజు గమనించారు. వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా ఆమె ప్రాణాలు కాపాడారు. ధైర్యంగా స్పందించిన రాజును స్థానికులు అభినందిస్తున్నారు.