
గుజరాత్లో ఐదేళ్ల బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్
గుజరాత్‌లోని పటాన్ జిల్లా వేద్ గ్రామంలో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు కింద పడటంతో ఇనుప రాడ్ నోటిలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు వెంటనే రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు, ప్రైవేట్ డెంటల్ సర్జన్ సహాయంతో సుమారు 40 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి, రాడ్‌ను విజయవంతంగా తొలగించారు. ఈ ఘటనలో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.




