సీజ్ ఫైర్‌ను రష్యా లెక్క చేయట్లేదు: జెలెన్‌స్కీ

16చూసినవారు
సీజ్ ఫైర్‌ను రష్యా లెక్క చేయట్లేదు: జెలెన్‌స్కీ
ఇంధన వసతులపై దాడులు నిలిపివేసేందుకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. మంగళవారం కీవ్‌పై జరిగిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారని తెలిపారు. అపార్ట్‌మెంట్ సమీపంలోని థర్మల్ ప్లాంట్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా చమురు వసతులపై ఉక్రెయిన్ దాడులు, వాటికి ప్రతిగా రష్యా జరుపుతున్న దాడులతో ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్