ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి
ఇండియా ఆగస్టు నెల అమ్మకాల్లో నిరాశను ఎదుర్కొంది. జూలైతో పోలిస్తే మొత్తం అమ్మకాలు 10 శాతం తగ్గడంతో, మంగళవారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 4 శాతానికి పైగా పతనమై నిఫ్టీలో టాప్ లూజర్గా నిలిచాయి. ఆగస్టులో 2,19,220 యూనిట్లు విక్రయించగా, జూలైలో 2,41,421 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. అయితే, వార్షికంగా చూస్తే డొమెస్టిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,31,278 నుంచి 1,76,971 యూనిట్లకు పెరిగాయి.