బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది. అదే రోజు శ్రద్ధా కపూర్ నటించిన ‘ఈథా’ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ క్లాష్ గురించి సల్మాన్ విచారం వ్యక్తం చేశారు. తనకు ఈ విషయం ముందుగా తెలియదని, అందుకే శ్రద్ధాకు స్వయంగా ఫోన్ చేసి క్షమాపణలు కోరినట్లు సల్మాన్ వెల్లడించారు. శ్రద్ధా దీనిని సానుకూలంగా తీసుకున్నారని, ప్రేక్షకులు రెండు చిత్రాలను చూడాలని ఆయన కోరారు. పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ ఈ తేదీని ఖరారు చేశామని ఆయన వివరించారు.