మహారాష్ట్రలోని ముంబైలో ముకేశ్
అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. పూజారి అంగవస్త్రం ధరింపజేసిన తర్వాత, సల్మాన్ వినాయకుడికి పూలు సమర్పించి నమస్కరించారు. నుదుటన తిలకంతో సంప్రదాయ పద్ధతిలో ఆయన పాల్గొన్న పూజ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై ఆయన అభిమానులు 'లౌకికత్వానికి నిదర్శనం' అంటూ ప్రశంసించారు.