ఉప్పు కిలో రూ.1.. రైతులు కన్నీరు

15375చూసినవారు
ఉప్పు కిలో రూ.1.. రైతులు కన్నీరు
వంటల్లో ఉపయోగించే ఉప్పు సాగు రైతులకు నష్టాలు మిగులుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఉప్పు భారీగా ఉత్పత్తి కావడంతో ధరలు పతనమయ్యాయి. గతంలో టన్ను రూ.2,500-4,000 వరకు పలకగా.. ప్రస్తుతం రూ.1,000లోపే, అంటే కేజీ రూపాయి చొప్పునే ధర లభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 60 కేజీల బస్తాను వ్యాపారులు కేవలం రూ.70కే కొనుగోలు చేస్తున్నారు. అయితే దుకాణాల్లో క్రిస్టల్‌ సాల్ట్‌ కేజీ రూ.25 వరకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఉప్పు సాగు ఎక్కువగా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్