
అప్పడాలపై పాదముద్రలేంటి.. నెటిజన్ల ఆగ్రహం (video)
పప్పు, పచ్చడితో పాటు అప్పడాలు తినని వారుండరు. అయితే, ఒక కంపెనీకి చెందిన అప్పడాల తయారీలో పరిశుభ్రత లోపించిందని ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, అప్పడాల ప్యాకెట్లలో పాదముద్రలు కనిపించాయి. నేపాల్ కు చెందిన పశుపతి కంపెనీ అప్పడాలను, భారతదేశంలో సంజనీ అనే కంపెనీ ప్యాకేజింగ్ చేసి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట ఆహార పదార్థాలు కొనేముందు జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లోనే వండుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.




