ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు 148 ప్రత్యేక రైళ్లు
Oct 18, 2026, 08:10 IST/

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు 148 ప్రత్యేక రైళ్లు

Oct 18, 2026, 08:10 IST
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఈ ఏడాది తీర్థయాత్ర సీజన్‌లో 148 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రి సురేష్ గోపీ కొట్టాయం రైల్వే స్టేషన్‌ను సందర్శించి ఈ విషయాన్ని వెల్లడించారు. భక్తుల రద్దీని బట్టి అదనపు రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు, యాత్రికులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, కొట్టాయం సహా మరిన్ని స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు.