శాంసంగ్‌ ఇండియాలో 100 మంది ఉద్యోగులపై వేటు

16చూసినవారు
శాంసంగ్‌ ఇండియాలో 100 మంది ఉద్యోగులపై వేటు
టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఇండియాలో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. టీవీ, హోమ్‌ అప్లయన్సెస్‌ సహా పలు విభాగాల్లో 80–100 మంది ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులను తొలగించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. డిమాండ్‌ మందగించడం, సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రాంచ్‌ మేనేజర్లు, టీమ్‌ లీడర్లు, ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్‌ స్థాయి ఉద్యోగులపై కూడా లేఆఫ్‌ ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. కాగా, కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

సంబంధిత పోస్ట్