
సరాఫ్ పల్లి: వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రులు
చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దేవీనవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దంపతులు కొన్యాల వీరేశం & నిఖిత, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




























