గుమ్మడిదల మండలం - Gummadidala

సంగారెడ్డి జిల్లా
చాకలి ఐలమ్మ  131వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు
Sep 26, 2026, 10:09 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం

చాకలి ఐలమ్మ 131వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు

Sep 26, 2026, 10:09 IST
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా, సంగారెడ్డి జిల్లాలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ ఐలమ్మ భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తొలి వీర మహిళ అని, ఆమె స్ఫూర్తిని ఉద్యమ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు సాయి వరాల, నర్సిములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.