జరసంగం మండలం - Jharasangam Mandal

సంగారెడ్డి జిల్లా
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా
Oct 05, 2026, 17:10 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా

Oct 05, 2026, 17:10 IST
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నమ్లమేట్ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ కిషోర్, పంచాయతీ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజల సౌలభ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చిందని సర్పంచ్ సాయిలు తెలిపారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ సేవలు మరింత సులభంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.