జిన్నారం మండలం - Krishnagiri

సంగారెడ్డి జిల్లా
Sep 16, 2026, 12:09 IST/

లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు

Sep 16, 2026, 12:09 IST
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో యువతిని కారు ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. గోమతీనగర్‌లోని జనేశ్వర్‌ మిశ్రా పార్క్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేసులో నిందితుడు షహన్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు, నిందితుడు ఏడాది కాలంగా పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్క్‌ వద్ద మరో యువతితో అతడిని చూసిన బాధితురాలితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం ఆమె కారు ముందు నిలబడగా వాహనం ముందుకు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.