Sep 26, 2026, 13:09 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
వరుసగా రెండో ఏడాది గణేష్ లడ్డూ సొంతం చేసుకున్న మోహిన్
Sep 26, 2026, 13:09 IST
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణేష్ లడ్డూ ప్రసాదం వేలంలో కంగ్టికి చెందిన మోహిన్ రూ. 4, 45, 000లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. శ్రీ సిద్ధి వినాయక యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో మోహిన్ అత్యధిక మొత్తానికి లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది కూడా ఇదే మండలి లడ్డూను రూ. 1, 11, 111లకు దక్కించుకున్న ఆయన, వరుసగా రెండో ఏడాది కూడా ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా మత సామరస్యం, సోదరభావం వెల్లివిరిశాయని పలువురు పేర్కొన్నారు.