
అసదుద్దీన్ ఓవైసీకి శుభాకాంక్షలు తెలిపిన ఖేడ్ మోహీద్ పటేల్
హైదరాబాద్ ఎంఐఎం అధినేతగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మోహీద్ పటేల్ హైదరాబాద్లోని ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్లో ఎంఐఎం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహీద్ పటేల్కు సూచించారు.
































