
తెల్లాపూర్లో బతుకమ్మ, దసరా వేడుకలకు సోమిరెడ్డి సన్నద్ధం
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ, విజయదశమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి తెలిపారు. అక్టోబర్ 10న ఎంగిలి పూల బతుకమ్మ, 18న సద్దుల బతుకమ్మ, 20న విజయదశమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం సోమిరెడ్డి తెల్లాపూర్ చెరువును పరిశీలించారు.
























