Sep 09, 2026, 12:09 IST/
టీచర్స్ డే విందులో రచ్చ.. హెడ్మాస్టర్ను కిందపడేసి కొట్టిన విద్యార్థులు
Sep 09, 2026, 12:09 IST
పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తలెత్తిన వివాదం హెడ్మాస్టర్, విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. విద్యార్థులపై హెడ్మాస్టర్ చేయిచేసుకోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో పాఠశాల ప్రాంగణం రణరంగాన్ని తలపించడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.