Sep 17, 2026, 03:09 IST/
నా భూముల్లో ఇంచు కూడా ఇనాం లేదు: జగదీష్ రెడ్డి
Sep 17, 2026, 03:09 IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 22ఏ భూముల అంశంతో పాటు కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై సీఎం చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని మండిపడ్డారు. తన భూముల్లో ఎలాంటి ఇనాం భూమి లేదని, అన్ని వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ భూములపై ప్రభుత్వం భిన్న వ్యాఖ్యలు చేస్తోందని, సిరిసిల్లలో మాజీ నక్సలైట్కు గతంలో కేటాయించిన భూమిని కూడా ప్రస్తుత ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు.