సదాశివపేట్ మండలం - Sadasivpet Mandal

సంగారెడ్డి జిల్లా
మోడల్ స్కూల్ విద్యార్థుల వ్యవసాయ క్షేత్ర సందర్శన
Sep 26, 2026, 14:09 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం

మోడల్ స్కూల్ విద్యార్థుల వ్యవసాయ క్షేత్ర సందర్శన

Sep 26, 2026, 14:09 IST
సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, మోర్గి విద్యార్థులు వ్యవసాయ వృత్తి విద్యలో భాగంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ-కృషి విజ్ఞాన కేంద్రం ను శనివారం  సందర్శించారు. ఈ పారిశ్రామిక సందర్శనలో విద్యార్థులు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం పొందారు. తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ప్రత్యక్ష అనుభవంతో అనుసంధానం చేసుకోవడానికి ఈ సందర్శన దోహదపడింది. కళాశాల ప్రిన్సిపాల్ టి. సువర్ణ మార్గదర్శకత్వంలో వృత్తి విద్య అధ్యాపకులు ఆలూరి వంశీ, PGT – Voc తెలుగు అధ్యాపకురాలు అశ్విని పర్యవేక్షణలో ఈ సందర్శన జరిగింది.