Oct 11, 2026, 13:10 IST/
ఈ నెలలోనే ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు!
Oct 11, 2026, 13:10 IST
కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఒక్కోసారి రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 24వ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నిధులను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో విడుదల చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.