
దిగ్వాల్లో నీటి కష్టాలు.. గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం దిగ్వాల్లో నెలకొన్న తీవ్ర నీటి కొరతతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, గ్రామానికి సక్రమంగా నీటి సరఫరా చేయాలని కోరుతూ గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
































