మౌలాలి వద్ద నిలిచిన శాతవాహన రైలు

3640చూసినవారు
మౌలాలి వద్ద నిలిచిన శాతవాహన రైలు
హైదరాబాద్‌లోని మౌలాలి వద్ద శాతవాహన సూపర్‌ ఫాస్ట్‌ రైలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్‌పై ఉన్న ప్యాంటో గ్రాఫ్‌ విరిగిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పట్టాలపైనే నిరీక్షిస్తున్నారు. ఈ సంఘటన ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్