చైనా మాస్టర్స్ 2026 టోర్నమెంట్లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో డెన్మార్క్కు చెందిన అస్ట్రుప్-రస్ముసెన్ జంటను హోరాహోరీగా జరిగిన మూడు సెట్ల పోరులో 21-13, 16-21, 21-18 తేడాతో భారత జోడీ ఓడించింది. 70 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత ద్వయం అద్భుతంగా పోరాడి విజయం సాధించింది.