
AIతో ఆయుధాల తయారీ.. హౌతీలపై ఆంథ్రోపిక్ ఆందోళన
యెమెన్‌లోని హౌతీలు తమ ఏఐ టెక్నాలజీతో ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. క్షిపణులు, రాకెట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఏఐ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తించారు. చైనా, రష్యా, యెమెన్ దేశాల్లో ఏఐ మోడల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని, యెమెన్‌లోని ఓ గ్రూపు మిస్సైల్ ప్రోగ్రామ్‌పై పనిచేస్తూ బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తున్నట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. మానవ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల స్థానంలో ఏఐ కోడ్‌ను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.




