
మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య కీలక చర్చలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఫోన్లో కీలక విషయాలపై చర్చించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం వంటి అంశాలపై చర్చించారు. ఎనర్జీ, రక్షణ, టెక్నాలజీ, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాల్లో సహకారంపై కూడా చర్చలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.




